బట్టలు లేకుండా నటించిన ఛార్మి… ఎవరికోసమో, ఎందుకోసమో తెలిసితే షాక్ అవుతారు..

Spread the love

దర్శకుడు పూరీ జగన్నాథ్ డిసెంబర్ 31న ‘హగ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో సర్‌ప్రైజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో విడుదల చేసిన ‘హగ్’ పోస్టర్ ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఎందుకంటే.. ఆ ఫొటోలో చెట్టును కౌగిలించుకున్న ఉన్న అమ్మాయి ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా ఉంది. ఆమె వెనుక భాగమంతా కనిపిస్తోంది. పచ్చని ప్రకృతి ఒడిలో ఓ అమ్మాయి చెట్టును ఆప్యాయంగా కౌగిలించుకోవడాన్ని చూస్తుంటే.. మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించి ఉంటారని తెలుస్తోంది. అమ్మాయిని నగ్నంగా చూపించడం వెనుకే ఇప్పుడు చర్చంతా.

‘‘పూరీ మీరు ఇలా సర్‌ప్రైజ్ చేస్తారని మేం అనుకోలేదు’’ కొందరంటే.. మరికొందరు ‘‘పోర్న్ సినిమా చేస్తున్నావా పూరీ’’ అని, అలానే ‘మీరు కూడా రాంగోపాల్‌ వర్మలా తయారయ్యారు, ఆర్జీవీ ఫ్యామిలీ అంతా ఇంతే. పోస్టర్‌ విషయంలో మరోసారి ఆలోచించుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ పోస్టర్ పై  రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. ‘హగ్‌’   షార్ట్‌ ఫిల్మ్‌ను చూశాను. వారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ఈ ‘హగ్‌’ సానుభూతి, గిల్ట్‌, ప్రేరణ వంటి రకరరాల భావోద్వేగాలను కలిగిస్తుంది’  అని వర్మ పోస్టు  చేశాడు. అయితే ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో మరో హాట్ న్యూస్ నడుస్తోంది.

ఆ పోస్టర్ లో కనిపిస్తోన్న కథనాయిక ఎవరో కాదు.. చాలా సినిమాలో స్టార్స్ తో నటించి.. ఇప్పుడు పూరి ప్రోడక్షన్ లో చేస్తున్న చార్మీనే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చార్మీ సినిమాలు ఆపేసిన తర్వాత.. పూరి దగ్గర పని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ హగ్ షార్ట్ ఫిల్మ్ లో చార్మినే నగ్నంగా నటించందని.. తెగ గుస గుసలు వినిపిస్తున్నాయి.

Loading...

Leave a Reply

Your email address will not be published.