అల్లు అర్జున్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరిష్.. ఎందుకో తెలుసా..?

Spread the love

అల్లువారబ్బాయి అల్లు అర్జున్ ఒకసారి చెప్పను బ్రదర్ అంటూ పవన్ అభిమానులను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన అభిమానులకే వార్నింగ్ ఇచ్చాడు. ఈ సంఘటన అల్లు శిరీష్ హీరోగా ‘ఒక్క క్షణం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. అల్లు శిరీష్ హీరోగా ‘ఒక్క క్షణం’ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ ప్రత్యేక అతిధిగా వచ్చాడు. ఈ ఈవెంట్ లో అభిమానుల మీద కొంచెం అసహనం వ్యక్తం చేసి వార్నింగ్ ఇచ్చినంత పని చేసాడు. ఒక రకంగా చెప్పాలంటే అభిమానులకు క్లాస్ పీకాడు.  ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు. మీరు అరవండి.

ఫంక్షన్ పెట్టేది మీ కోసమే. అయితే మాట్లాడటం అయ్యాక అరవండి అంటూ చిన్న పాటి క్లాస్ పీకాడు అల్లు అర్జున్. అభిమానులు కంట్రోల్ లో లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. ఎవరైనా వాళ్ల ఫీలింగ్ చెప్పుకునేటప్పుడు అడ్డం రాకూడదు. మీ సంతోషం నాకు అర్థమౌతోంది. కానీ మాట్లాడేటప్పుడు అరుస్తుంటే నేను హర్ట్ అయ్యాను. కొంచెం కోప్పడ్డాను. ఏవీ మనసులో పెట్టుకోవద్దు. ఇది ఎప్పట్నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది అందుకే చెప్పను అని అంటున్నాడు బన్నీ.

బన్నీ ఇలా రెచ్చిపోతుంటే పక్కనే ఉన్న శిరీష్ దాన్ని కవర్ చేయటానికి నానా తంటాలు పడి చివరకు మీతో మాట్లాడింది బన్నీ కాదని “నా పేరు సూర్య” సినిమాలో సూర్య క్యారెక్టర్ అని చెప్పాడు. అయితే తర్వాత అల్లు అల్లు అర్జున్ కి అల్లు శిరిష్ వార్నింగ్ ఇచ్చాడట. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నువ్వు అలా మాట్లాడటం వల్ల నీకు చెడ్డ పేరు రావడమే కాకుండా మాకు కూడా చెడ్డ పేరు వస్తోంది. అభిమానులు అరుస్తే.. వారి అరుపుల తర్వాత మాట్లాడాల్సింది.. ఇలా చేసే పవన్ ఫ్యాన్స్ తో రచ్చ రచ్చ జరిగింది. మళ్లీ ఎందుకు అన్న ఇలా మాట్లాడవ్.. అని అల్లు అర్జున్ పై శిరిష్ సీరియస్ అయ్యాడట

Loading...

Leave a Reply

Your email address will not be published.